కరోనాకు మందు దొరికినట్లేనా?

బెంగుళూరు: కోవిడ్‌-19 వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇంట‌ర్పెరాన్ ప్రోటీన్‌తో కూడిన స‌మ్మేళ‌నం క‌రోనా ర‌క్కసిని జ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషించ‌నుంద‌ని గుర్తించిన‌ట్లు ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు విశాల్‌ రావు తెలిపారు. సాధార‌ణంగా మానవ శరీర కణాలు వైరస్లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, అయితే కోవిడ్‌-19 విష‌యంలో మాత్రం ఇవి ప‌నిచేయండం లేద‌ని , అంతేకాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌ట్లు  శుక్రవారం పేర్కొన్నారు.











"రెగ్యుల‌ర్ చెక్అప్‌లో భాగంగా మనుషుల ర‌క్తాన్ని సేక‌రించిన‌ప్పుడు బప్ఫీకోట్ అనే ప‌దార్థం ఉత్న‌న్న‌మ‌వుతుంది. దీని నుంచే ఇంటర్ఫెరాన్ అనే ప్రోటీన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది. ఈ రెండింటికి సైటోకిన్లతో కూడిన ఒక స‌మ్మేళ‌నాన్ని జోడించి చికిత్స అందించ‌డం ద్వారా ఇది క‌రోనాపై శ‌క్తివంతంగా పోరాడ‌గ‌లద‌ని విశ్వ‌సిస్తున్నాం. ఇప్ప‌టికే దీని గురించి రాష్ర్ట ప్ర‌భుత్వానికి తెలియ‌చేశాం". అని డాక్ట‌ర్ విశాల్‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ప్రత్యేక ఇంటర్ఫెరాన్ థెర‌పీని ప్రారంభ‌ద‌శ‌లో ఉన్న క‌రోనా రోగుల‌పై ప్ర‌యోగించ‌నున్న‌ట్లు తెలిపారు. చివ‌రి ద‌శ‌లో ఉన్న రోగులకు వారి ఎముక మజ్జ నుంచి లేదా దాత‌ల నుంచి సేక‌రించిన క‌ణాలను ఉప‌యోగించి చికిత్స అందివ‌నున్న‌ట్లు తెలిపారు.