అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైరటీ మనిషి. డాక్టర్‌ను కాదంటూనే వైద్య చిట్కాలు చెప్పేస్తున్నారు. ఆయన చెప్పే విషయాల్లో కొన్ని డౌట్లు పుట్టిస్తున్నాయి. ఆయన వేసే డౌట్లు మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. సలహా ఇస్తున్నాడా .. చావు నుంచి కాపాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. వైట్‌హౌజ్ మీడియాకు ట్రంప్ ఓ అంతుచిక్కని వ్యక్తిగా మారారు. మొహమాటం ఏదీ ఉండదు. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. వైరస్ వల్ల వేల మంది చనిపోతున్నా.. ఆయన మాత్రం మేటి డాక్టర్ తరహాలో వెరైటీ సలహాలు ఇస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా.. ట్రంప్ మాత్రం తన సహజ ధోరిణి కొనసాగిస్తున్నారు. గురువారం ట్రంప్ నిర్వహించిన మీడియా సమావేశం అమెరికా ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టేసింది. క్రిమిసంహారకాన్నిశరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. కరోనా వైరస్ ఒక్క నిమిషంలో చనిపోతుందనుకుంటా.. అవునంటారా కాదంటారా అంటూ ట్రంప్ ఒక్కసారి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా చేస్తే బాగుంటుందంటారా అన్న ఆశ్చర్యాన్నే ఆయన డాక్టర్లతో వ్యక్తం చేశారు. కరోనాకు ఇదో ట్రీట్మెంట్ అన్న ఓ అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తపరిచారు.
ట్రంప్ చిట్కాలు.. అమెరికన్లు ఉక్కిరిబిక్కిరి